కిలో విత్తనాన్ని 100 మి. లీ ఘాడ ఘందకికామ్లం లో 2-3 నిముషాలు నానబెట్టిన తర్వాత నీడలో ఆరబెట్టాలి. తర్వాత తగినంత తుమ్మ జిగురు కలిపి 5 గ్రాముల ఇమిదక్లోప్రిడ్ 70 డబ్లు యస్ లేద 4 గ్రాముల థయమితక్షం లేద 50 గ్రాముల కర్బోసల్ఫాన్ తో విత్తనశుద్ధి చేసి విత్తితే 30-40 రోజులవరకు రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఎ ప్రాంతాలలో బాక్తిరియ నల్లమచ్చ తెగులు ఉదృతంగా ఉన్నదో ఆ రైతులు ఒక లీటర్ నీటిలోనికి 100 మి. లీ. పోశోమైసిన్ లేదా ప్లన్తోమైసిన్ లేదా మూడు గ్రాముల బ్లితొక్ష్ తో కలిపి 6-8 గంటలవరకు నానబెట్టి నీడలో ఆరబెట్టాలి.
ట్రైకోడెర్మ తో విత్తనశుద్ది ;
ఒక కిలో విత్తనానికి ఐదు గ్రామూలా త్రికోడెర్మ విరిడే పొడిని మరియు యాబై గ్రాముల బెల్లాన్ని కలిపి నీడలో ఆరబెట్టాలి. దీని వలన శిలంద్రాల వలన వచ్చే తెగులును అరికట్టవచ్చు.